- ఒప్పులకుప్పా -ఒయ్యారి భామా
సన్నాబియ్యం- చాయపప్పు
బావిలో కప్పా- చేతిలో చిప్పా
రోట్లో తవుడు- నీ మొగుడెవరు?
గూట్లో రూపాయ్- నీ మొగుడు సిపాయ్ - చుక్ చుక్ రైలు
చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగి నాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయ్ తినిపిస్తా
చల్లని పాలు తాగిస్తా - చిట్టి చిట్టి మిరియాలు
చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి
బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో బిడ్డపుడితే
అల్లంవారి కుక్క భౌ భౌ మన్నది
చంకలో పాప కేర్ కేర్ మన్నది - చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా
రంగు రంగులా రెక్కలతో
సింగారాలు చిందేరా?
వన్నెల వన్నెల్ పూల మీద వాలుచున్నారా?
కన్నుల కన్నుల పండుగ చేస్తూ కదులుతున్నారా?
వనమంతా-దినమంతా వసంత శోభలతో
అందాల- ఆనందాల ఆటలాడేరా
చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా. - వేకువమ్మ లేచింది
తూరుపు వాకిలి తెరిచింది
గడపకు కుంకం పూసింది
బంగరు బిందె తెచ్చింది
ముంగిట వెలుగులు చల్లింది - అవ్వ అంగడి పోయింది
తియ్యని బెల్లం తెచ్చింది
కుడాలెన్నో చేసింది
అక్కకు అన్నకు ఇచ్చింది
మిగతావన్నీ దాచింది
మెల్లగ పిల్లి వచ్చింది
తినటం అవ్వ చూసింది
కర్ర పట్టుకొని కొట్టింది.
Post A Comment:
0 comments: